బెంగాల్ సర్కార్ పై సీజేఐ సీరియస్
ఇలాంటి కేసు 30 ఏళ్లలో చూడలేదు
ఢిల్లీ – కోల్ కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు . గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం ఏమిటో పూర్తిగా స్పష్టం అవుతోందని పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి కోల్ కతా పోలీసుల నివేదికను తాను ఇవాళే చూస్తానని అన్నారు. వెంటనే నివేదిక తమకు అందజేయాలని ఆదేశించారు. ఇది చాలా ప్రమాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. డాక్టర్ అసహజ మరణం కేసు నమోదుకు ముందుగా పోస్ట్ మార్టం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.
ఈ సందర్బంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బెంగాల్ లో కొలువు తీరిన టీఎంసీ ప్రభుత్వాన్ని. ఇలాగేనా వ్యవహరించేది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది సర్కారేనంటూ స్పస్టం చేశారు సీజేఐ. ఇదిలా ఉండగా జస్టిస్ పార్థీవాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా కేసును గత 20 సంవత్సరాలలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. మొత్తంగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.