సీఎంకు పిల్లలుంటే తెలిసేది బాధేంటో
ట్రైనీ డాక్టర్ తల్లి సంచలన కామెంట్స్
పశ్చిమ బెంగాల్ – కోల్ కతా ఆర్జ్ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కు గురైన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా చని పోయిన తన కూతురు గురించి లేనిపోని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బాధితురాలి తల్లి.
ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు పిల్లలు లేరని, ఉంటే ఆ బాధ ఏమిటో తెలిసేదన్నారు. అందుకే బిడ్డను కోల్పోయిన బాధను అర్థం చేసుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధ పెట్టాయని వాపోయారు బాధితురాలి తల్లి. “మమతా బెనర్జీ ఏమైనా చెప్తారు, ఏమి చెప్పాలో, ఏమి చెప్పకూడదో ఆమెకు తెలియదు!”
నా కుమార్తెకు న్యాయం చేయాలని ఈరోజు యావత్ భారతదేశం నిలబడి నిరసన తెలుపుతోంది, కానీ ముఖ్యమంత్రి పట్టించు కోలేదు అంటూ బాధితురాలి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.