పౌర సరఫరాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి – సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృశింహ స్వామి వారి చంధనోత్స వేడుకల సందర్బంగా క్యూలైన్లో ఉన్న భక్తులపై గోడ కూలిన దుర్ఝటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ గా స్పందించారని చెప్పారు మంత్రి కొలుసు పార్థసారథి. సహాయక చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఈ దుర్ఝటనకు సంబందించిన నివేదికను 72 గంటల్లో అందజేయాలంటూ ముగ్గరు ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కమిషన్ ను నియమించడం జరిగిందన్నారు. ఈ దుర్ఝటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తెలిపారు.
బాదిత కుటుంబాలకు చెందిన వారికి ఔట్ సోర్సింగ్ పై ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి అదేశించినట్లు చెప్పారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృశింహ స్వామి వారి చంధనోత్స వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేయడం జరిగిందన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రకృతి పరంగా పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షం కారణంగా క్యూలైన్ల కోసమని నిర్మించిన గోడ నాని భక్తులపై పడటం వల్ల ఈ దుర్ఝటనకు దారితీసిందన్నారు. ఈ దుర్ఝటనకు బాధ్యులైన వారికి తక్షణ చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర పురపాల, పట్టణాభివృద్ది శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ చైర్మన్ గా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎ.రవికృష్ణ, జలవనరుల శాఖ ఎడ్వైజర్ , ఇంజనీర్ ఇన్ ఛీఫ్ వెంటకనేశ్వరరావు సభ్యులుగా విచారణ కమిషన్ ను ప్రభుత్వం నియమించినట్లు ఆయన తెలిపారు.