NEWSANDHRA PRADESH

ప్ర‌జా రంజ‌క బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టాం

Share it with your family & friends

ఏపీ స‌మాచార శాఖ మంత్రి కామెంట్

అమ‌రావ‌తి – ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ఇవాళ ప్ర‌జా రంజ‌క బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టింద‌ని అన్నారు రాష్ట్ర గృహ నిర్మాణ‌, స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రం ఆర్థికంగా చిధ్రమైనా కూడా ఎంతో అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బ‌డ్జెట్ ను త‌యారు చేశార‌ని చెప్పారు.

ప్రజలు ఎంతో విశ్వాసంతో, పూర్తిగా చిధ్ర‌మైన‌ రాష్ట్రాన్ని పట్టా లెక్కిస్తారనే నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం అందించారని అన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని ఆరోపించారు కొలుసు పార్థ‌సారథి.

గత ఐదేళ్లలో వ్యక్తి కోసం పరిపాలనా? ప్రజల కోసం పరిపాలనా? అన్నట్లు పరిస్థితులు కనిపించింద‌న్నారు. రాష్ట్ర ఆర్థిక వనరులను, కేంద్ర ప్రభుత్వ నిధులను, సహజ వనరులను దారి మళ్లించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్, ఇసుక పాలసీలు పూర్తిగా లోప భూయిష్టంగా ఉన్నాయ‌ని చెప్పారు.

ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చినవి, ఇవ్వనివి కూడా ఈ ఐదు నెలల లోనే అమలు చేసి చూపిస్తోందని అన్నారు. .ఎన్టీఆర్ భరోసా పథకం కింద రూ.3 వేల పెన్షన్ ను రూ.4 వేలకు పెంచడం జరిగిందన్నారు..
వికలాంగుల పెన్షన్ను రూ.10000 దాకా పెంచడం జరిగిందని చెప్పారు.