క్రిష్టియన్ల సంక్షేమానికి రూ. 150 కోట్లు
మంత్రి కొలుసు పార్థ సారథి
అమరావతి – రాష్ట్రంలో క్రిష్టియన్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టిందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. బడ్జెట్ లో రూ. 150 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం క్రిష్టియన్లను పట్టించు కోలేదని ఆరోపించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశామన్నారు. క్రిస్టియన్ యువత తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ది దిశగా తమ సర్కార్ కృషి చేస్తుందని చెప్పారు.
నూజివీడు పట్టణంలో నెహ్రూ కాలనీలో తెలుగుదేశం నాయకులు బి, ఇళయరాజా, బి,రమేష్,బి, ప్రసన్నకుమార్ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ సెమీ క్రిస్టమస్ కు ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కొలుసు పార్థసారథి.
అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు. క్రిష్టియన్ సోదర సోదరీమణులకు బహుమతులను పంపిణీ చేశారు మంత్రి. క్రిస్టియన్ సంక్షేమానికి వారి అభివృద్ధికి జెరుసలేం యాత్రకు, విదేశీ విద్యను అభ్యచించేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించిందని చెప్పారు.
తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు కొలుసు పార్థసారథి. గతంలో 255 క్రైస్తవ మందిరాలకు బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం కూడా మాదే అన్నారు. గతంలో క్రిస్టియన్ సోదరులకు అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇచ్చామన్నారు.