జగన్ కామెంట్స్ కొలుసు సీరియస్
ప్రాజెక్టులు నిర్వీర్యం చేసింది నువ్వే
అమరావతి – ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి , సర్వ వ్యవస్థలను భ్రష్టు పట్టించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు పార్థసారథి.
అన్నింటిని పక్కన పెట్టేసి కేవలం తన ఆస్తులను పోగేసుకునేందుకు మాత్రమే దృష్టి సారించారని ఆరోపించారు. ఈ ఐదేళ్ల కాలంలో ఏపికి చేసింది ఏమీ లేదన్నారు.
ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టులు ఏవి మొదలు పెట్టక పోగా ఉన్న వాటికి కనీసం మెయింటెనెన్స్ కూడా చెయ్యకుండా నిర్లక్ష్యం చేసింది మీరు కాదా జగన్ రెడ్డిని ప్రశ్నించారు కొలుసు పార్థసారథి. ఓవైపు ప్రకృతి భీభత్సానికి ఏపీ ఊపిరి ఆడక తండ్లాడుతుంటే మరో వైపు వైసీపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడటం దారుణమన్నారు.
సభ్య సమాజం , వరద బాధితులు జగన్ రెడ్డిని, ఆయన పరివారాన్ని ఛీదరించుకుంటారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు కొలుసు పార్థసారథి. ఇప్పటికే 6 లక్షల మంది నిరాశ్రయులుగా మారారని, అంతులేని నష్టం వాటిల్లిందన్నారు. తమ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందన్నారు.