టచ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
టచ్ లో ఉన్నారన్న కోమటిరెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తామని, ప్రభుత్వాన్ని పడ గొడతామంటూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
గులాబీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పూర్తిగా తమతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. ఇక కేసీఆర్ కు నిద్ర పోయేందుకు కూడా ఛాన్స్ ఇవ్వమన్నారు. చెడపకురా చెడెదవు అన్న నానుడి అనుభవంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తానంటూ బీరాలు పలికిన కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందన్నారు. ముందు తన కుటుంబాన్ని సరి చూసుకుంటే బెటర్ అని సూచించారు. త్వరలోనే కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు.
లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో ఎవరూ ఉండరని, కేవలం కేసీఆర్, తన్నీరు, కేటీఆర్, సంతోష్, కవిత మాత్రమే మిగులుతారంటూ ఎద్దేవా చేశారు. ఇకనైనా జాగ్రత్తగా మసులుకుంటే బెటర్ అని సూచించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.