హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి
హైదరాబాద్ – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తికి సంబంధించి భార్య, బిడ్డల సాక్ష్యాలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, గండ్ర వెంకట రమణా రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని అన్నారు. ఇదిలా ఉండగా కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని, దీనికి కారణం కేసీఆర్, హరీశ్ రావు అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజలింగం మూర్తి.
నిన్న తనను దారుణంగా హత్య చేశారు. ఈ హత్య ఉమ్మడి ఓరుగల్లు జిల్లాతో పాటు రాష్ట్రంలో కలకలం రేపింది. దీనిని పూర్తిగా ఖండించారు బండ్ర వెంకట రమణా రెడ్డి. తన వెనుక ఎవరు ఉన్నారనేది త్వరలో తేలుతుందన్నారు. రాజకీయంగా దిగజారి పోయిన కోమటిరెడ్డి ఇలా తనపై లేని పోని ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
సీబీఐ కాక పోతే సీబీసీఐడీతో దర్యాప్తు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. కోర్టు మీద తమకు గౌరవం ఉందన్నారు. తనను చంపాల్సిన అవసరం తమకు ఏముంటుందని ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షల కారణంగానే తను హత్యకు గురయ్యాడని, కానీ ఆ హత్యను రాజకీయంగా వాడు కోవాలని చూడడం దారుణమన్నారు గండ్ర వెంకట రమణా రెడ్డి.