బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాప్ ఖాయం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్ – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈనెల 13న మంగళవారం భారత రాష్ట్ర సమితి పార్టీ చేపట్లాలని అనుకున్న బహిరంగ సభ అట్టర్ ప్లాప్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో లేరన్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు ఆ పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని , అందుకే ఆయన తన ప్రాపకం పెంచుకునేందుకు గాను తమ పార్టీని, సర్కార్ ను పదే పదే విమర్శలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఒకవేళ హరీశ్ రావు గనుక తమ పార్టీలో చేరితే చేర్చుకునేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ లో నుంచి 26 మంది ఎమ్మెల్యేలతో పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ మంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చారు.
గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో చేసిన పాపాలు కడుక్కొనేందుకు హరీశ్ రావుకు దేవాదాయ శాఖకు మంచి ఛాన్స్ అన్నారు. ఈ అవకాశాన్ని పోగొట్టు కోవద్దంటూ కోరారు.