కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు..?
నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి. సోమవారం రాష్ట్ర శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్బంగా స్పందించారు ఎమ్మెల్యే. ఒక ప్రతిపక్ష నాయకుడిగా తమ ప్రభుత్వం గౌరవం ఇచ్చిందని, కానీ ఆ గౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టు కోవడం లేదంటూ మండిపడ్డారు .
ప్రజలు గెలిపించింది అసెంబ్లీకి రాకుండా ఉండేందుకేనా అని ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివానని పదే పదే చెప్పే కేసీఆర్ ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడ్డారు. శాసన సభ ప్రజా దేవాలయమని, ప్రజలకు సంబంధించిన సమస్యలను ఎత్తి చూపాల్సిన వ్యక్తి, ప్రతిపక్ష నేతగా పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించడం దారుణమన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ప్రజలు కేసీఆర్ ను ఛీదరించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నాడని, అమవాసకో లేదా పున్నానికో ఒకసారి వచ్చి పోయేందుకు ఇదేమన్నా తన రాజ్యమా అని నిప్పులు చెరిగారు కేసీఆర్ పై. ఇకనైనా కేసీఆర్ తన పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్యే. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైన మాజీ సీఎంకు ప్రతిపక్ష నేత నుంచి తొలగించాలని సీఎంను కోరారు.