కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
నల్లగొండ జిల్లా – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరిలో ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని, తాను హోం శాఖ మంత్రిని అవుతానని ప్రకటించారు. లేకపోతే ఇబ్బంది అవుతుందన్నారు.
తనకు ఏదైనా కావాలని అనుకుంటే అడగనని అన్నారు. లాక్కుంటానని చెప్పారు. తనకు కావాల్సింది దక్కాలంటే ముందు మీరంతా తమ అభ్యర్థిని ఆశీర్వదించాలని, అఖండ మెజారిటీతో గెలిపిస్తే దుమ్ము రేపుతానని చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
రాష్ట్ర ప్రజలంతా తనను హోం మంత్రిగా చూడాలని అనుకుంటున్నారని, వారి కోరికను తాను ఎందుకు కాదనాలని అన్నారు. తాను మినిష్టర్ ను అయితే బీఆర్ఎస్ నేతలను జైల్లోకి వెళ్లేలా చేస్తానని చెప్పారు. ఇన్నాళ్ల పాటు తమను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఊరికే వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ఇదిలా ఉండగా కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. తనకు కూడా మంత్రి పదవి కావాలని కోరుతున్నారు రాజగోపాల్ రెడ్డి.