కేటీఆర్ దమ్ముంటే రిజైన్ చేయ్
నిప్పులు చెరిగిన కోమటిరెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు రాజీనామాలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి తెర లేపారు. మొత్తంగా రాజకీయాలను మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి, అక్రమాలను వెలుగు తీస్తామని, అక్రమార్కుల భరతం పడతామని , కేసీఆర్ , కుటుంబాన్ని చర్లపల్లి జైలుకు పంపిస్తామని ప్రగల్భాలు పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగా ప్రయత్నాలు లేవు. కాళేశ్వరం లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని కాగ్ చీవాట్లు పెట్టింది. అయినా సోయి లేకుండా మేడిగడ్డపై ఫోకస్ పెట్టింది సర్కార్.
ఇది పక్కన పెడితే శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆయన కేటీఆర్ ను టార్గెట్ చేశారు. ముందు సిరిసిల్లకు నువ్వు రాజీనామా చేయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు.
జనం మాత్రం రెండు పార్టీలను నమ్మడం లేదు. సవాళ్లను బంద్ చేసి సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.