Monday, April 21, 2025
HomeENTERTAINMENTఅల్లు అర్జున్ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే

అల్లు అర్జున్ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే

నిప్పులు చెరిగిన మంత్రి కోమ‌టిరెడ్డి
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత కామెంట్స్ చేసిన న‌టుడు అల్లు అర్జున్ త‌క్ష‌ణ‌మే క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. ఘ‌ట‌న జ‌రిగాక వెళ్లి చూడ‌లేద‌న్నారు. ఆనాడు క‌ష్ట కాలంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ఆదుకున్నార‌ని కానీ ఈనాడు హీరోలు ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం వ్య‌వ‌హారంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయ‌న అల్లు అర్జున్ ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏం సాధించాడ‌ని సినీ సెలిబ్రిటీలు క్యూ క‌ట్టారంటూ ప్ర‌శ్నించారు.

అల్లు అర్జున్ కు ఏమైంద‌ని సంద‌ర్శించార‌ని, ప‌రామ‌ర్శించారంటూ ఎద్దేవా చేశారు. అంతే కాదు ఆయ‌న‌కు ఏమైనా కాలు పోయిందా, కిడ్నీలు పాడ‌య్యాయా అంటూ మండిప‌డ్డారు ముఖ్య‌మంత్రి. ఇదే స‌మ‌యంలో ఏసీపీ విష్ణు మూర్తి తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ జోలికి వ‌స్తే తోలు తీస్తామంటూ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ల‌క్షా 30 వేల మంది పోలీస్ కుటుంబాల‌ను కించ ప‌రిచేలా మాట్లాడితే బాగుండ‌దంటూ హెచ్చ‌రించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments