షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి
హైదరాబాద్ – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు తన ముందు బచ్చాలంటూ మండిపడ్డారు. వాళ్లతో తనకు పోలికలు ఏంటి అంటూ ప్రశ్నించారు.
వాళ్లందరి కంటే తాను ముందుగా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తాను ఎంతో మంది సీఎంలను చూశానని చెప్పారు. తాను ఎవరితో పోల్చుకోనని, తాను ఇంకెవరికీ పోటీ కానని అన్నారు. తన పోటీ మాజీ సీఎం కేసీఆర్ తోనేనని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
మీరంతా తనతో కేటీఆర్ ను పోల్చడం మంచి పద్దతి కాదన్నారు. తనతో పోల్చే ముందు వెనుకా ముందు చూసుకోవాలని మీడియాకు సూచించారు. తాను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కేటీఆర్ పాలిటిక్స్ లోకి వచ్చాడన్నారు.
తన గురించి మాట్లాడే హక్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదన్నారు. అలాంటిది ఈ బచ్చా కేటీఆర్ ఎంత అంటూ నిప్పులు చెరిగారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మీరు కూడా గడికోసారి కేటీఆర్ గురించి అడగడం భావ్యం కాదన్నారు.