విధ్వంసానికి చెక్ ప్రజా పాలన భేష్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా తీవ్రంగా స్పందించారు. గతంలో కేసీఆర్ పాలించిన పదేళ్ల కాలం పూర్తిగా తెలంగాణను సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. ఆ రాచరిక పాలన పోయిందన్నారు. ప్రస్తుతం ప్రజా పాలన దిగ్విజయంగా సాగుతోందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. పదేండ్ల విధ్వంసానికి చెక్ పెట్టామన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. 26.45 లక్షల మంది ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందని వెల్లడించారు.
అంతే కాకుండా 40 లక్షల మందికి రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. 41.78 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందజేశామని తెలిపారు మంత్రి. ఇదే సమయంలో అన్ని వర్గాల వారికి ఉచితంగా రూ. 10 లక్షలకు పెంచుతూ ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామని తెలిపారు .