రేవంత్ అంటే కేసీఆర్ కు భయం
అందుకే అసెంబ్లీకి రావడం లేదు
హైదరాబాద్ – రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉండదంటూ అవాకులు చెవాకులు పేలుతున్న బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అంటే మాజీ సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని, అందుకే అనారోగ్యం పేరుతో అసెంబ్లీకి రావడం లేదంటూ ఎద్దేవా చేశారు. దమ్ముంటే శాసన సభకు రావాలని, అక్కడ తాడో పేడో తేల్చు కోవాలని సవాల్ విసిరారు.
తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది కాక పైగా తమపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఎలా అని మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు.
ఇక బీఆర్ఎస్ లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఈపాటికే బీఆర్ఎస్ ఎప్పుడో ఖాళీ అయి పోయి ఉండేదన్నారు మంత్రి. ఆ పార్టీలో కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే మిగులుతుందన్నారు. ఎల్ఆర్ఎస్ పై ఇంకా గైడ్ లైన్స్ పూర్తి కాలేదన్నారు.