కేసీఆర్ పాలనలో తెలంగాణ నాశనం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు నీళ్ల పాలు చేశాడని ఫైర్ అయ్యారు.
పదేళ్లుగా తన ఆస్తులను పెంచుకున్నాడని, వందేళ్లకు సరిపడా నాశనం అయ్యేలా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను అడ్రస్ లేకుండా చేయడం ఖాయమని జోష్యం చెప్పారు. ప్రజలకు అన్నీ తెలుసని, మరోసారి ఇంటికే పరిమితం చేయడం తప్పదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఎంత ధైర్యం ఉంటే తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని అంటారని అన్నారు. తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. తమ జోలికి వస్తే పుట్టగతులు ఉండవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి. అధికారం పోయిందన్న అసంతృప్తితో లేనిపోని ఆరోపణలు తమపై చేస్తున్నారని కల్వకుంట్ల కుటుంబానికి రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు .