NEWSTELANGANA

హ‌రీశ్ క‌లెక్ష‌న్ ఏజెంట్

Share it with your family & friends

కోమ‌టిరెడ్డి కామెంట్స్

హైద‌రాబాద్ – అసెంబ్లీ సాక్షిగా రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను, అల్లుడు , మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావును టార్గెట్ చేశారు. ప‌దే ప‌దే త‌మ అన్న‌ద‌మ్ముల‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చిన గులాబీ దండుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు.

ప్ర‌ధానంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాల‌ను ఎండ‌గ‌ట్టారు. ఎవ‌రి ప్ర‌మేయం లేకుండానే కోట్లాది రూపాయ‌లు నీళ్ల పాలు అవుతాయ‌ని ప్ర‌శ్నించారు. ఆనాడు నీటి పారుద‌ల శాఖ మంత్రిగా ఉన్న త‌న్నీరు హ‌రీశ్ రావుకు ఇందులో భాగం లేదా అని నిల‌దీశారు.

తెలంగాణ పేరుతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నార‌ని, వాటిని దాచుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఒక ర‌కంగా చెప్పాలంటే హ‌రశ్ రావు త‌న మామ కేసీఆర్ కు డ‌బ్బులు అంద‌జేసే పోస్ట్ మ్యాన్ గా వ్య‌వ‌హ‌రించాడ‌ని , క‌లెక్ష‌న్ ఏజెంట్ గా మారి పోయాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి.