బీఆర్ఎస్ దుకాణం బంద్
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ జిల్లా – రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. త్వరలోనే ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు . తాము గనుక టార్గెట్ చేస్తే ఆ పార్టీ నామ రూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు. ఎవరి పరిధిలో వారుంటే మంచిదన్నారు.
ఇప్పటి వరకు ఆ పార్టీ గురించి పట్టించు కోవడం లేదన్నారు. జనం బండ కేసి కొట్టారని, వారి పాలన పూర్తిగా నాటి నిజాం నవాబు పాలనను మరిపించేలా చేసిందని , అందుకే ఓడి పోయారంటూ ఎద్దేవా చేశారు. తాము వచ్చాక ప్రజా పాలన సాగిస్తున్నామని చెప్పారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
నీటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు . గ్రామాలలో వేసవి కారణంగా నీళ్లకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు మంత్రి. డబ్బుల ఆశలతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను సర్వ నాశణం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నిలువునా దోచుకున్నారంటూ ధ్వజమెత్తారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.