మాధవీలత ఆస్తులు రూ. 221 కోట్లు
బీజేపీ అభ్యర్థిగా బరిలో విరించి చైర్మన్
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొంపెల్ల మాధవీలత హైదరాబాద్ లోక్ సభ బరిలో ఉన్నారు. ఆమె భారీ ఎత్తున తన అనుచర గణంతో ర్యాలీగా తరలి వచ్చారు. నామినేషన్ దాఖలు చేశారు.
తను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఏకంగా రూ. 221 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనగా మారారు కొంపెల్ల మాధవీలత. ఆమె గత కొంత కాలంగా హైదరాబాద్ లో సామాజిక సేవా కార్యక్రమాలతో పేరు పొందారు.
ప్రముఖ ఆస్పత్రి విరించి ఆస్పత్రికి చైర్మన్ గా ఉన్నారు ఆమె. ఊహించని రీతిలో బీజేపీ హైకమాండ్ అనుకోకుండా గత కొంత కాలంగా గెలుస్తూ వస్తున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా బరిలో నిలిచారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఓవైసీకి వణుకు పుట్టిస్తున్నారు మాధవీలత.
ఆయనకంటే ముందంజలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఆమె ఎంఏ వరకు చదువుకున్నారు. హిందీ, ఆంగ్లం, తెలుగు భాషల్లో మంచి పట్టు కలిగి ఉన్నారు.