ఎంపీ ఎంపిక వెనుక ఏమిటా కథ
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ తాజాగా ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. కానీ ఒకే ఒక్కరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం విరించి ఆస్పత్రి చైర్ పర్సన్ కొంపెల్ల మాధవీ లతకు హైదరాబాద్ ఎంపీగా ప్రకటించడంతో అంతా విస్తు పోయారు. గత కొంత కాలం నుంచీ ఆమె ముస్లిం సమాజం అత్యధికంగా ఉన్న చార్మినార్, హైదరాబాద్ లలో విస్తృతంగా పర్యటిస్తోంది.
మాధవీలత ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. ఆమె త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో అత్యంత బలమైన అభ్యర్థి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో పోటీ పడనుంది. ఆమె ప్రొఫెషనల్ భరత నాట్యం డాన్సర్ గా గుర్తింపు పొందారు. ఆమె లోపా ముద్ర చారిటబుల్ ట్రస్ట్ , లతామా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కూడా.
లోపా ముద్ర ట్రస్టు ద్వారా హైదరాబాద్ ప్రాంతంలోని వివిధ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఆహార పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. మాధవీలత కోఠి మహిళా కాలేజీలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు. ఆమె ప్రసంగాలు, ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.