రేవంత్ రెడ్డిది ఏబీవీపీ సంస్కారం
బీజేపీ నేత మాధవీలత కామెంట్స్
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, విరించి ఆస్పత్రుల యాజమాన్యం చైర్మన్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ , సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో రేవంత్ ఆర్ఎస్ఎస్ లో పని చేశారని, ఆ తర్వాత కాలేజీలో ఏబీవీపీ నేతగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ టూర్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన తమందరికీ పెద్దన్న అంటూ పొగిడారు.
ఇదే సమయంలో రేవంత్ రెడ్డిని బీజేపీ టైగర్ గా ఆప్యాయంగా పిలుచుకునే మలక్ పేట ఎమ్మెల్యే రాజా సింగ్ మెచ్చుకోవడం విస్తు పోయేలా చేసింది. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మురళీధర్ రావు జాతీయ మీడియాతో మాట్లాడారు. సంచలన కామెంట్స్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ పర్యటనలో రేవంత్ రెడ్డి రాజకీయ పరిణతి ప్రదర్శించారని ప్రశంసలు కురిపించారు. ఫెడరల్ స్పూర్తిని చాటారని పేర్కొన్నారు . ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఏకంగా ఓ అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డిది ఏబీవీపీ సంస్కారం అని ప్రశంసల జల్లలు కురిపించారు.