NEWSTELANGANA

నా గెలుపు త‌థ్యం – కొంపెల్ల‌

Share it with your family & friends

గంగా న‌దిలో హార‌తి ఇచ్చిన నేత

ఉత్త‌ర ప్ర‌దేశ్ – త‌న గెలుపున‌కు ఢోకా లేద‌ని స్ప‌ష్టం చేశారు హైద‌రాబాద్ భార‌తీయ జ‌న‌తా పార్టీ లోక్ స‌భ అభ్య‌ర్థి కొంపెల్ల మాధ‌వీల‌త . ఆదివారం ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని వార‌ణాసిలో ని గంగా న‌ది వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ ఆమె హార‌తి ఇచ్చారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఈసారి ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు. ఎంఐఎం చీఫ్ ఓవైసీకి బిగ్ షాక్ త‌గ‌ల‌క త‌ప్ప‌ద‌న్నారు. దేశంలో మ‌రోసారి కాషాయ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు. గంగా న‌దిలో హార‌తి ఇచ్చిన అనంత‌రం మాధ‌వీల‌త మీడియాతో మాట్లాడారు.

ఆధ్యాత్మిక‌త భార‌త దేశ‌పు ఆత్మ అని పేర్కొన్నారు. 143 కోట్ల మంది భార‌తీయులు మూకుమ్మ‌డిగా ప్ర‌ధాన మంత్రిగా న‌రేంద్ర మోడీ కావాల‌ని కోరుకుంటున్నార‌ని తెలిపారు. త‌మ పార్టీకి 400 కు పైగా సీట్లు రావ‌డం త‌ప్ప‌ద‌న్నారు. భార‌త దేశం అభివృద్దికి న‌మూనాగా మారింద‌న్నారు.