NEWSTELANGANA

ఓవైసీకి త‌ప్ప‌దు ఓట‌మి

Share it with your family & friends

బీజేపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌త

హైద‌రాబాద్ – ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ గా బ‌రిలో ఉన్న ఓవైసీకి ఓటమి త‌ప్ప‌ద‌న్నారు బీజేపీ అభ్య‌ర్థి కొంపెల్ల మాధ‌వీ ల‌త‌. ఆమె మీడియాతో మాట్లాడారు. గ‌త కొంత కాలంగా ఆధిప‌త్యం చెలాయిస్తూ వ‌స్తున్న ఓవైసీకి ప్ర‌జ‌లు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నార‌ని అన్నారు. శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్బంగా చేప‌ట్టిన శోభా యాత్రకు అశేష‌మైన రీతిలో స్పంద‌న వ‌చ్చింద‌ని చెప్పారు.

కేవ‌లం మ‌తం పేరుతో ఓట్లు దండుకుంటూ రాజ‌కీయం చేస్తూ వ‌చ్చిన ఓవైసీకి ఈసారి గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురు కాబోతున్నాయ‌ని అన్నారు మాధ‌వీల‌త‌. తాను విరించి ఆస్ప‌త్రి య‌జ‌మానిరాలిగానే కాకుండా స్వ‌చ్చంద సంస్థ ద్వారా ఎన్నో ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ప‌నులు చేప‌ట్టాన‌ని పేర్కొన్నారు.

ఇందులో కులం, మ‌తం అన్న‌ది చూడ‌కుండా ప్ర‌తి ఒక్క‌రికీ భ‌రోసా క‌ల్పించేలా ప్ర‌య‌త్నం చేశాన‌ని స్ప‌ష్టం చేశారు. కానీ తాను ఏనాడూ రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించ లేద‌న్నారు. కేవ‌లం సామాజిక సేవ అన్న దృక్ఫ‌థంతో ప‌ని చేశాన‌ని చెప్పారు కొంపెల్ల మాధ‌వీల‌త‌. త‌న ప‌నితీరు గురించి బీజేపీ న‌చ్చి త‌న‌కు టికెట్ ఇచ్చింద‌న్నారు. త‌న‌కు ఆద‌ర్శ ప్రాయ‌మైన వ్య‌క్తి ఒకే ఒక్క‌రు ఉన్నార‌ని ఆయ‌నే మ‌న ప్ర‌ధాని మోదీ అని తెలిపారు.

గ‌త కొంత కాలంగా ఇక్క‌డ బోగ‌స్ ఓట్లతో గెలుస్తూ వ‌చ్చారంటూ ఓవైసీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.