NEWSTELANGANA

దేశాభివృద్దిలో మ‌హిళ‌లు కీల‌కం

Share it with your family & friends

ఎంపీ అభ్య‌ర్థి కొంపెల్ల మాధ‌వీల‌త

హైద‌రాబాద్ – దేశం, రాష్ట్రాభివృద్దిలో కీల‌క‌మైన పాత్ర మ‌హిళ‌లు పోషిస్తున్నారంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ , హైద‌రాబాద్ ఎంపీ అభ్య‌ర్థి, విరించి హాస్పిట‌ల్ చైర్మ‌న్ కొంపెల్ల మాధ‌వీల‌త పేర్కొన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె ముందంజ‌లో కొన‌సాగుతున్నారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మాధ‌వీల‌త‌ను ఎంపిక చేసింది బీజేపీ హై క‌మాండ్.

మొత్తం 17 ఎంపీ స్థానాల‌కు 9 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. వీరిలో మాధ‌వీల‌త‌కు ఛాన్స్ ఇవ్వ‌డంతో మిగ‌తా పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విస్తు పోయారు. నారీ శ‌క్తి వంద‌న్ అభ‌నంద‌న్ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా కొంపెల్ల మాధ‌వీల‌త పాల్గొని ప్ర‌సంగించారు.

మ‌హిళ‌ల‌ను , వారి శ‌క్తిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఒక‌నాడు ఇంటికే ప‌రిమిత‌మైన స్త్రీలు, యువ‌తులు ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయ మ‌హిళా శ‌క్తిని చాటి చెబుతున్నార‌ని కొనియాడారు. సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేస్తూ భార‌తీయ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని తెలిపారు కొంపెల్ల మాధ‌వీల‌త‌.

ఇదే స‌మ‌యంలో గోషా మ‌హ‌ల్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని జి. నారాయ‌ణ‌మ్మ ఇంజ‌నీరింగ్ కాలేజీలో ఉమెన్ ఎంప‌వ‌ర్ మెంట్ అనే అంశంపై స‌ద‌స్సులో పాల్గొన్నారు ఎంపీ అభ్య‌ర్థి.