ఏపీ సర్కార్ పై కోన ప్రశంసలు
సీఎం జగన్ రెడ్డికి అభినందనలు
హైదరాబాద్ – ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. గతంలో ఏపీలో విద్యా, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేశారని ఆవేదన చెందారు. ఇదే సమయంలో పవర్ లోకి వచ్చిన వైసీపీ సర్కార్ జగన్ సారథ్యంలో గణనీయమైన పురోగతిని సాధించిందని పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి ఆయన బాపట్లలోని ప్రభుత్వ చిన్న పిల్లల దవాఖానా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇందుకు గాను ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాల గురించి తెలిపారు. ఎక్కడా లేని రీతిలో ప్రభుత్వం తీర్చి దిద్దిందని , పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారని పేర్కొన్నారు కోన వెంకట్. ఆయన షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
అభివృద్ది అంటే మాటలు కాదని చేతల్లో చూపించాలని, ఇందుకవు తాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని అభినందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులన్నీ కార్పొరేట్ ఆస్పత్రులను తల దన్నేలా జగన్ రెడ్డి చేశారంటూ కితాబు ఇచ్చారు కోన వెంకట్.