NEWSTELANGANA

ఎట్ట‌కేల‌కు కొణ‌తం దిలీప్ విడుద‌ల

Share it with your family & friends

పెద్ద ఎత్తున స్పందించిన బీఆర్ఎస్

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ తెలంగాణ వాది, ర‌చ‌యిత‌, టెక్ ఎక్స్ ప‌ర్ట్ , తెలంగాణ డిజిట‌ల్ మీడియా మాజీ చీఫ్ కొణ‌తం దిలీప్ రెడ్డి ఎట్ట‌కేల‌కు శుక్ర‌వారం పోలీసుల చెర నుంచి విడుద‌ల‌య్యారు. త‌న‌పై సామాజిక మాధ్య‌మాల‌లో పోస్ట్ చేసిన పోస్ట‌ర్స్, కామెంట్స్ పై సీరియ‌స్ అయ్యారు ఖాకీలు. ఈ సంద‌ర్బంగా కొణ‌తం దిలీప్ రెడ్డిని విడుద‌ల చేయాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అయ్యింది.

భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏ ప్రాతిప‌దిక‌న అరెస్ట్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు. దీంతో పోలీసులు వెన‌క్కి త‌గ్గారు. శుక్ర‌వారం కొణ‌తం దిలీప్ రెడ్డి ఇంటికి వ‌చ్చారు.

ఈ సంద‌ర్బంగా ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. తాను క్షేమంగా ఇంటికి చేరుకున్నాన‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెంద వ‌ద్ద‌ని కోరారు. మీ అంద‌రి పోరాటం వ‌ల్ల‌నే త‌న‌కు విముక్తి ల‌భించింద‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న పైన పెట్టిన అక్ర‌మ కేసు, అక్ర‌మ నిర్బంధం మీద స్పందించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, సింగి రెడ్డి నిరంజ‌న్ రెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ , ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ , ఎమ్మెల్యే వివేకానంద్, బొల్లం మ‌ల్ల‌య్య‌, ముఠా గోపాల్ , షంబీ పూర్ రాజు, త‌క్క‌ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, కాలేరు వెంక‌టేశ్ , మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, క్రిశాంక్ , వై సతీశ్ రెడ్డి, డాక్ట‌ర్ ఎర్రోళ్ల శ్రీ‌నివాస్, గెల్లు శ్రీ‌నివాస్ కు ఈ సంద‌ర్బంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు కొణ‌తం దిలీప్ రెడ్డి.