ANDHRA PRADESHNEWS

ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటా

Share it with your family & friends

ప్ర‌క‌టించిన మంత్రి కొండా సురేఖ
అమ‌రావ‌తి – తెలంగాణ గిరిజన శాఖ మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త్వ‌ర‌లో ఏపీలో జ‌రిగే శాస‌న స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాను పాల్గొంటాన‌ని స్ప‌ష్టం చేశారు . ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చిన వెంట‌నే కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా తాను క్యాంపెయిన్ చేస్తాన‌ని చెప్పారు మంత్రి.

మంగ‌ళ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. గ‌తంలో జ‌గ‌న్ కు పుల్ స‌పోర్ట్ గా నిలిచారు. ఆ త‌ర్వాత వైసీపీని వీడారు కొండా సురేఖ‌. ఇదిలా ఉండ‌గా సీన్ మారింది. ఇప్పుడు వైఎస్ ష‌ర్మిలా రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయ‌బోతున్నారు. ఒక ర‌కంగా ఇది విచిత్రం .

ఒక‌నాడు జ‌గ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తుగా నిలిచిన కొండా సురేఖ ఉన్న‌ట్టుండి ఇప్పుడు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ష‌ర్మిలా రెడ్డికి ప్ర‌చారం చేయ‌బోతున్నారు. ఈ మేర‌కు జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం అనూహ్యంగా తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఏపీలో కూడా ఏడు గ్యారెంటీల పేరుతో అధికారం లోకి రావాల‌ని చూస్తోంది.