మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన వివక్షకు గురై ఎందరో బలిదానాలు, ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఇంకా ఆంధ్రోళ్ల పెత్తనం కొనసాగుతోంది. నిస్సిగ్గుగా రాష్ట్ర సర్కార్ లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి కొండా సురేఖ వత్తాసు పలకడం విడ్డూరంగా ఉంది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టులో ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా ఆంధ్రకు చెందిన రజినీకాంత్ రెడ్డిని నియమించారు. దీనిపై బీఆర్ఎస్ తీవ్రంగా తప్పు పట్టింది. ఇదే అంశానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు.
రజనీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారని, ఇప్పటి వరకు 2,200 కేసులు వాదించారని, అందుకే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆయనను నియమిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.