కేటీఆర్ వల్లే ఆ ఇద్దరు విడి పోయారు
మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. సినీ ఫీల్డ్ కు చెందిన నాగ చైతన్య, సమంత విడి పోయేందుకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. అంతే కాదు చాలా మంది హీరోయిన్లు తొందరంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం ఆయనేనని మండిపడ్డారు.
డ్రగ్స్ అలవాటు చేయడమే కాకుండా రేవ్ పార్టీలు నిర్వహించింది వాస్తవం కాదా అని సురేఖ ప్రశ్నించారు. ఇది తెలుగు సినీ రంగంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. పదేళ్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కొండా సురేఖ.
కేటీఆర్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని, హీరోయిన్లకు కూడా అలవాటు చేశాడని, వారి జీవితాలను నాశనం చేశాడని ఆరోపించారు మంత్రి. ఇదిలా ఉండగా తాజాగా కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ రంగంలో అటు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.