ఓటు కీలకం డెమోక్రసీకి బలం
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా – జిల్లాలోని చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం పోలింగ్ సందర్బంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు భార్య, పిల్లలు సైతం ఓటు వేశారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటు అత్యంత కీలకమని, ప్రజాస్వామ్యానికి బలం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించు కోవడం వల్ల ప్రజాస్వామ్యం బతికి బట్ట కడతుందన్నారు.
సాయంత్రం దాకా ఇళ్లల్లో ఉన్న వారంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మొత్తంగా తాను గెలవడం ఖాయమనేనని ధీమా వ్యక్తం చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఓటును నిర్లక్ష్యం చేయడం వల్ల మనకు నష్టం జరుగుతుందని గుర్తించాలని అన్నారు.
ఈ దేశంలో మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కొలువు తీరడం తప్పదన్నారు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం పట్ల ఓటర్లు ప్రభావితం అయ్యారని తనకు అనిపిస్తోందని అన్నారు ఎంపీ అభ్యర్థి.