శ్రీకృష్ణుడి జీవితం ఆదర్శ ప్రాయం
ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి – శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియ చేశారు ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారిక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాని పేర్కొన్నారు. గీతాసారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమేనని స్పష్టం చేశారు కొండపల్లి శ్రీనివాస్.
ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మన విజయం సాధించ వచ్చని తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీల మేఘ శ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రం పైన, తెలుగువారందరికీ సదా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నట్లు స్పష్టం చేశారు ఏపీ మంత్రి.
ఆగస్టు 26న సోమవారం దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. పీఎం మోడీతో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.