NEWSANDHRA PRADESH

టెట్ లో 150కి 150 మార్కులు సాధించిన అశ్విని

Share it with your family & friends

స‌త్తా చాటిన పేదింటి బిడ్డ‌కు కంగ్రాట్స్

అమ‌రావ‌తి – ఎవ‌రీ కొండ్రు అశ్విని అనుకుంటున్నారా. తను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన పేద కుటుంబానికి చెందిన యువ‌తి. ఏపీ ప్ర‌భుత్వం తాజాగా ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్) నిర్వ‌హించింది. ఇటీవ‌లే ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ టెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏకంగా 150 మార్కుల‌కు గాను 150 మార్కులు సాధించింది కొండ్రు అశ్విని. ఇది టెట్ చ‌రిత్ర‌లో ఓ రికార్డ్ అని చెప్పక త‌ప్ప‌దు.

ఆర్ధిక స్థోమత లేకున్నా చదువు మాత్రమే ప్రయోజకుల్ని చేయగలదని నమ్మింది కొండ్రు అశ్విని. ప్రభత్వ విద్యాలయాల్లోనే చదువుకుని ఏపీ టెట్ ఫలితాల్లో 150కి 150 మార్కులు సాధించి ఔరా అనేలా చేసింది.

అరుదైన ఘ‌న‌త సాధించిన కొండ్రు అశ్వినికి ఈ సంద‌ర్బంగా అభినంద‌న‌లు తెలిపారు ఏపీ రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. పేదరికంలో ఉన్నా ఆటో నడుపుతూనే ఆడపిల్లని చదివించిన కొండ్రు శంకరరావు, వెంకటలక్ష్మి దంపతులకు శుభాభినందనలు తెలిపారు.

అంతే కాదు త‌న‌ను ఎంతగానో ప్రోత్సహించిన మా నాన్నగారి కష్టాన్ని మళ్ళీ గుర్తు చేశావ్ తల్లీ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు అనిత వంగ‌ల‌పూడి.