Sunday, April 20, 2025
HomeSPORTSర్యాపిడ్ చెస్ ఛాంపియ‌న్ గా కోనేరు హంపి

ర్యాపిడ్ చెస్ ఛాంపియ‌న్ గా కోనేరు హంపి

చ‌రిత్ర సృష్టించిన మ‌రో తెలుగు ఆణిముత్యం

అమెరికా – కోనేరు హంపీ చ‌రిత్ర సృష్టించింది. ఆదివారం అమెరికా రాజ‌ధాని న్యూయార్క్ లో ర్యాపిడ్ ఛాంపియ‌న్ షిప్ కు సంబంధించి ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ కీల‌క పోరులో ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకంద‌ర్ ని ఓడించి ర్యాపిడ్ చెస్ ఛాంపియ‌న్ షిప్ టైటిల్ ను కైవ‌సం చేసుకుంది.

2019లో జార్జియాలో జ‌రిగిన ఈవెంట్ లో కూడా స‌త్తా చాటారు హింపి. 37 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ఆమె 11 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో ర‌ష్యాకు చెందిన 18 ఏళ్ల వోలోడ‌ర్ ముర్జిన్ టైటిల్ గెలుపొందాడు.

ఇదిలా ఉండ‌గా ముర్జిన్ 17 సంవత్సరాల వయస్సులో టైటిల్‌ను సాధించిన నోడిర్బెక్ అబ్దుసట్టోరోవ్ తర్వాత ఫైడ్ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా రెండవ యువకుడు కావ‌డం విశేషం.

ఇటీవల సింగపూర్‌లో జరిగిన క్లాసికల్ ఫార్మాట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో డి గుకేశ్ దొమ్మ‌రాజు చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత హంపీ సాధించిన ఈ ఘనత భారత చెస్‌కు సంచలనాత్మక సంవత్సరాన్ని అందించింది.

ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కోనేరు హంపిని అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments