ENTERTAINMENT

దేవ‌ర ద‌మ్మున్న సినిమా – కొర‌టాల శివ

Share it with your family & friends

అన్ని వ‌ర్గాల‌కు పండ‌గేనంటున్న డైరెక్ట‌ర్

హైద‌రాబాద్ – ద‌మ్మున్న డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను జూనియ‌ర్ ఎన్టీఆర్ , జాహ్న‌వి క‌పూర్ తో తీసిన దేవ‌ర చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27 శుక్ర‌వారం విడుద‌ల కానుంది. సినిమా త‌ప్ప‌కుండా స‌క్సెస్ కావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ఎమోష‌న్స్ ను పండించ‌డంలో తార‌క్ టాప్ లో ఉంటాడ‌ని కొనియాడారు. అన్ని వ‌ర్గాల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చి తీరుతుంద‌ని అన్నారు కొర‌టాల శివ‌.

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత దేవ‌ర చిత్రం వ‌స్తుండ‌డంతో తార‌క్ అభిమానులు ఎంతో ఆతృత‌తో ఎదురు చూస్తున్నార‌ని, వారంద‌రికీ న‌చ్చేలా తీశాన‌ని చెప్పారు. గ‌తంలో తాను జూనియ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ తీశాన‌ని, అప్ప‌టి నుంచి నేటి దాకా తామిద్ద‌రి మ‌ధ్య అద్భుత‌మైన బంధం నెల‌కొంద‌న్నారు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.

బ‌డ్జెట్ గురించి ఆలోచించ లేద‌ని, కేవ‌లం సినిమా మీద దృష్టి పెట్టామ‌న్నారు. తాను తొలుత తార‌క్ కు క‌థ చెప్పేట‌ప్పుడు సినిమా తీయాల‌ని అనుకున్నామ‌ని, కానీ రెండో పార్ట్ కూడా ప్లాన్ చేశామ‌ని పేర్కొన్నారు కొర‌టాల శివ‌.