తమకు పాత టీచర్లే కావాలని నినాదాలు
హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది అంతా రోడ్డెక్కారు. తమను పర్మినెంట్ చేయాలని లేదా టైమ్ స్కేల్ ఇవ్వాలంటూ ఆందోళన బాట పట్టారు. ఇవాల్టితో వీరు చేపట్టిన నిరసన 18 రోజులు పూర్తయ్యాయి. ఓ వైపు ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు .
వీరిని పక్కన పెట్టి కేజీబీవీలలో ప్రభుత్వ టీచర్లను పని చేసేందుకు ప్రయత్నం చేయడం పై మండిపడుతున్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మెకు అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు బాసటగా నిలిచాయి. వారి న్యాయ పరమైన డిమాండ్ల ను పరిష్కరించాలని కోరుతున్నాయి.
తాజాగా ఎన్నికల సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి తాము పవర్ లోకి వచ్చిన వెంటనే పర్మినెంట్ చేస్తామని ప్రకటించారని కానీ కుర్చీలో కూర్చోగానే వాటిని మరిచి పోయాడని వాపోయారు ఎస్ఎస్ఏ ఏద్యోగులు. ఇదిలా ఉండగా తమకు సర్కార్ టీచర్లు వద్దంటూ విచిత్రంగా కోరుట్ల మండలం కల్లూరు కస్తూర్బా స్కూల్ పిల్లలు రోడ్డెక్కారు.
తమకు పాత టీచర్లే కావాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకు కూర్చున్నారు. త్వరలోనే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయని, వెంటనే సర్కార్ స్పందించాలని కోరారు.