కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు
అమరావతి – గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఆయనను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం పిటిషన్ ను విచారించనుంది కోర్టు. వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. ఈ ఘటనకు తనే ప్రధాన కారకుడని టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. దీంతో కూటమి సర్కార్ కొలువు తీరింది. ఈ సందర్బంగా కేసులు ఒక్కొక్కరిపై నమోదవుతూ వస్తున్నాయి.
జగన్ మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో రెచ్చి పోయాడు. బూతులు మాట్లాడాడు. ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన భార్య, కొడుకు మంత్రి నారా లోకేష్ బాబులను టార్గెట్ చేశాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు వంశీ కూడా ఓడి పోయాడు. ప్రస్తుతం లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని ప్రకటించారు.