తెలుగులో క్రిష్ణగిరి ఎంపీ ప్రమాణం
సంచలనంగా మారిన కె. గోపీనాథ్
న్యూఢిల్లీ – లోక్ సభలో ఆశ్చర్య కరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణకు చెందిన ఎంపీలు జై తెలంగాణ అంటూ పేర్కొంటే పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ మాత్రం తెలుగు వారు సిగ్గు పడేలా ఏకంగా తెలుగు భాషలోనే ప్రమాణ స్వీకారం చేశారు కె. గోపీనాథ్.
విచిత్రం ఏమిటంటే తన మాతృ భాష తమిళం అయినప్పటికీ తను మాత్రం తెలుగులో చదవడం ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేలా చేసింది. ఇవాళ మాతృ భాష కనుమరుగై పోతోంది. ప్రత్యేకించి ఎప్పుడైతే ఇంగ్లీష్ భాష జాడ్యం అలవడిందో దాని వెంటే జనం పరుగులు తీస్తున్నారు. ఆ భాష రాకపోతే మనుషులే కారన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
ఈ దేశంలో అత్యధికంగా జాతీయ అభిమానం కలిగిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది తమిళనాడు రాష్ట్రం మాత్రమే. తమిళులు ఎక్కడికి వెళ్లినా, ఏ ప్రాంతాన్ని సందర్శించినా లేక ఏ దేశానికి వెళ్లినా తమ భాషలోనే మాట్లాడతారు. ఇంకే భాషను మాట్లాడేందుకు ఇష్ట పడరు.
ప్రస్తుతం లోక్ సభలో తెలుగులో ప్రమాణం చేసిన ఎంపీ కె. గోపీ నాథ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు సిగ్గు పడేలా చేశారు.