కాగితాలు కాల్చేస్తే మోసాలు పోతాయా
మాజీ మంత్రి కేఎస్ జవహర్ కామెంట్
అమరావతి – మాజీ మంత్రి కేఎస్ జవహర్ నిప్పులు చెరిగారు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. కాగితాలను కాల్చేసినంత మాత్రాన చేసిన తప్పులు, పాపాలు, మోసాలు ఎలా మాయమై పోతాయని ప్రశ్నించారు. చేసిన వాటికి శిక్ష అనుభవించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.
శ్యాండ్ , ల్యాండ్ , మైన్స్ దేనినీ వదిలి పెట్ట లేదని, అందినంత మేరకు దోచుకున్నారని ఆరోపించారు. ఇబ్బడి ముబ్బడిగా దారుణాలకు పాల్పడ్డారని, కోట్లాది రూపాయల ప్రజా ధనం లూటీ చేశారని ధ్వజమెత్తారు కేఎస్ జవహర్.
ఏదో ఒక రోజు దొంగలు దొరకడం ఖాయమన్నారు. వాసుదేవరెడ్డి, సమీర్ శర్మలు అప్రూవర్ లుగా మారి నిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి లాంటి నేతలు దోచుకున్నదంతా కక్కించి ప్రజలకు పంచుతామన్నారు.
జగన్ రెడ్డి, వైసీపీ నేతలు దోపిడీకి కాదేది అనర్హంగా దేన్ని వదలకుండా దోచుకున్నారని మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ మండిపడ్డారు. దోచుకున్న ఫైళ్లు దొరక్కుండా దగ్ధం చేస్తున్నారని వాపోయారు. అయినా ఎవరినీ వదిలి పెట్టబోమంటూ హెచ్చరించారు. మంగళగిరి లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.