ప్రకటించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీకి సంబంధించి ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. గ్రామ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. పార్టీకి సంబంధించి అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ సంవత్సరం కొంత ఇబ్బందితో ప్రారంభమైందన్నారు. ఇది కాంగ్రెస్ ఢోకా సంవత్సరం అంటూ ధ్వజమెత్తారు.
సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ పార్టీకి లేనంతటి సభ్యత్వం తమ పార్టీకి ఉందన్నారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి జనాన్ని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేశారంటూ మండిపడ్డారు కేటీఆర్. కొత్త ఏడాదిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై యుద్దం చేస్తామని ప్రకటించారు కేటీఆర్.