బీఆర్ఎస్ సమన్వయకర్తల ఎంపిక
ప్రకటించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ కు సంబంధించి సీనియర్ నాయకులను నియోజకవర్గ సమన్వయకర్తలను ఎంపిక చేశారు.
ఆయా నియోజకవర్గాల పరంగా చూస్తే జహీరాబాద్ కు దేవీ ప్రసాద్ రావు, ఆందోల్ కు డీసీసీబీ చైర్మన్ పట్నం మా\ణిక్యం, నారాయణ్ ఖేడ్ కు మఠం భిక్షపతి, కామారెడ్డికి జనార్దన్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు కేటీఆర్.
ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గానికి తిరుమల్ రెడ్డి, బాన్సువాడకు దఫెదర్ రాజు , జుక్కల్ నియోజకవర్గానికి పోచారం భాస్కర్ రెడ్డిని నియమించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. వీరంతా పూర్తి బాధ్యతతో పార్లమెంట్ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించారు కేటీఆర్.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు.