NEWSTELANGANA

స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష

Share it with your family & friends

కేసీఆర్ నాయ‌క‌త్వం కావాల‌ని కోరుకుంటున్నారు

హైద‌రాబాద్ – స్వీయ రాజ‌కీయ అస్తిత్వ‌మే తెలంగాణ‌కు శ్రీ‌రామ ర‌క్ష అని తెలంగాణ గాంధీ జ‌య‌శంక‌ర్ సార్ చెప్పింది అక్ష‌రాల వాస్త‌వామ‌ని అన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇవాళ‌ ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని, ఆ నాటి పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. దాని కోసం త‌మ‌ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

తెలంగాణపై కేసీఆర్ ఏ విధంగా చెరగని ముద్ర వేశారో మళ్లీ గుర్తు చేసుకుంటూ.. రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు కదం తొక్కుతామ‌ని ప్ర‌క‌టించారు. 29న చేప‌ట్టే దీక్షా దివ‌స్ ను స‌క్సెస్ చేసేందుకు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు కేటీఆర్.

ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇంచార్జ్‌లుగా నియమించామ‌ని ప్ర‌క‌టించారు. దీక్షా దివస్ నిర్వహణ కోసం ఈ నెల 26న అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామ‌ని తెలిపారు కేటీఆర్. కేసీఆర్ తన దీక్షను ముగించిన డిసెంబర్ 9వ తేదీన‌ మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామ‌ని వెల్ల‌డించారు.

కేసీఆర్ దీక్షలో నిమ్స్ హాస్పిటల్ పాత్ర కూడా ఘనమైనదని అన్నారు. ఆ రోజు నిమ్స్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిందని చెప్పారు. అందుకే ఆ రోజు నిమ్స్ హాస్పిటల్‌లో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేస్తామ‌న్నారు.