ప్రశ్నించే గొంతుకలు కావాలి
మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు..ధిక్కార స్వరాలు కావాలని అన్నారు. ప్రశ్నించడం ఎప్పుడైతే ఆగి పోతుందో విచ్చల విడితనం పెరిగి పోతుందన్నారు కేటీఆర్.
అబద్దపు హామీలతో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచేలా, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని ఆదరించాలని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా ప్రజల పక్షాన ఉంటూ తన వాయిస్ వినిపిస్తూ వస్తున్న రాకేష్ రెడ్డి లాంటి యువకుడని గెలిపించాలని కోరారు కేటీఆర్.
ఇలాంటి వ్యక్తికి, ఉత్సాహ వంతుడైన యువకుడికి ఓటు వేయడం వల్ల న్యాయం జరుగుతుందన్నారు. శాసన మండలిలో నిరుద్యోగుల పక్షాన గొంతు వినిపించాలంటే తప్పనిసరిగా మీ విలువైన ఓటు ఉపయోగించు కోవాలని సూచించారు.