అనుకోకుండా మాట్లాడా..మన్నించండి
మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చా
హైదరాబాద్ – మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని, వారి పట్ల తనకు చులకన భావం ఏనాడూ లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం ఆయన తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ముందు విచారణకు హాజరయ్యారు.
ఇటీవల మహిళలను ఉద్దేశించి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. మహిళలకు పనీ పాటా లేదని, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అంటూ బస్సు ప్రయాణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఆయనకు నోటీసు జారీ చేసింది. 24న హాజరు కావాలని ఆదేశించింది.
కమిషన్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఇవాళ హాజరయ్యారు. తాను యధాలాపంగా మాట్లాడటం జరిగిందని, మహిళలకు ఇప్పటికే క్షమాపణ చెప్పానని అన్నారు. విచరాణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా మాట దొర్లటంపై క్షమాపణ అడిగానని అన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ తాము కమీషన్ ముందుకు వస్తే.. మహిళా కాంగ్రెస్ నేతలు తమ నాయకులపై దాడి చేయడం దారుణమన్నారు కేటీఆర్. తాను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో మహిళలపై దాడులు కొనసాగుతున్నాయని, వాటి గురించి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు తెలియ చేశామన్నారు.