NEWSTELANGANA

మ‌గాడివి అయితే రుణ మాఫీ చేయ్

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గెలిచిన ప్ర‌తిసారి మగాడివి , ఓడి పోతే కాదు అంటావా అని ఎద్దేవా చేశారు. ద‌మ్ముంటే నువ్వు మ‌గాడివే అయితే రైతు రుణ మాఫీ చేయాల‌ని స‌వాల్ విసిరారు. గురువారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

కోడంగ‌ల్ లో ఓడి పోయిన సంగతి మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. కామారెడ్డిలో కాటిప‌ల్లి చేతిలో ఖంగు తిన‌లేదా అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన 420 హామీలు అమ‌లు చేయి అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి ఆత్మ న్యూన‌తా భావం ఉంద‌న్నారు.

రేవంత్ కు ద‌మ్ముంటే సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ్ ..మ‌ల్కాజిగిరిలో పోటీ చేద్దాం అని పిలుపునిచ్చారు. అది ఆయ‌న సిట్టింగ్ సీటే క‌దా ద‌మ్ముంటే పోటీకి దిగాల‌న్నారు. నేను సిరిసిల్ల‌లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు కేటీఆర్.

నాది మేనేజ్ మెంట్ కోటా అయితే..రాహుల్, ప్రియాంక గాంధీలది ఏ కోటా రేవంత్ రెడ్డి చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా అని ఆరోపించారు. బిల్డ‌ర్లు, వ్యాపారుల‌ను బెదిరించాలి..ఢిల్లీకి క‌ప్పం క‌ట్టాలి..బ్యాగులు మోయాల‌న్నారు. త్వ‌ర‌లో బిల్డ‌ర్లు, వ్యాపారులు రేవంత్ రెడ్డి సెస్ పైన రోడ్డు ఎక్క‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు.