రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
దమ్ముంటే చర్చకు రావాలి
హైదరాబాద్ – మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆరోపణలు చేయడం కాదు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
నిపుణుల ముందు నువ్వు పెట్టిన సర్క్యూలర్ , క్రిశాంక్ పెట్టిన సర్క్యులర్ పెట్టి ఏది ఒరిజనల్ ఏది డూప్లికేట్ కాదో తేల్చుకుందాం దా అని మండిపడ్డారు. ఎవరు చంచల్ గూడ జైలుకు వెళతారో తేలుతుందన్నారు. అబద్దాలు మాట్లాడుతూ జనాన్ని మోసం చేస్తున్న చరిత్ర నీదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
త్వరలో జరగబోయే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన పార్టీకి షాక్ తప్పదని హెచ్చరించారు. పనిగట్టుకుని బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. శశాంక్ ఏం చేశాడని అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. తాము న్యాయం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.
ఆరు నూరైనా ఈసారి ప్రజలు తగిన రీతిలో షాక్ ఇవ్వక తప్పదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.