కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పు
లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల పట్ల చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి సీతక్క సీరియస్ అయ్యారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్ ను.
మహిళలను గౌరవించాల్సిన బాధ్యత కలిగిన స్థానంలో వ్యక్తి ఇలాగేనా చులకన చేసి మాట్లాడటం అంటూ మండిపడ్డారు. మీ ఇంట్లో మహిళలు లేరా అని ప్రశ్నించారు. విచిత్రం ఏమిటంటే కేటీఆర్ స్థాయి మరిచి పోయి, సోయి లేకుండా దిగజారుడు మాటలు మాట్లాడటం విస్తు పోయేలా చేసింది. పలువురికి ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన నాయకుడు గతి తప్పి, మతి లేకుండా కామెంట్స్ చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. అహంకారం, బలుపు, కుంచిత మనస్తత్వం, మహిళల పట్ల నీచమైన ఆలోచన, ప్రజల పట్ల చులకన కేటీఆర్ కు జన్మతః వచ్చిన స్వభావాలు అంటూ మేధావులు పేర్కొన్నారు.
కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు మహిళలు.