మహిళా జర్నలిస్టులపై దాడి దారుణం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలనకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. ఇలాగే కొనసాగుతూ పోతే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చస్త్రశారు కేటీఆర్.
పదే పదే ఇందిరమ్మ పాలన అంటూ ప్రచారం చేసుకునే కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రుణమాఫీ సరిగా జరిగి ఉంటే.. సీఎంకు అంత భయమెందుకని నిలదీశారు కేటీఆర్.
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య. వెంటనే కాంగ్రెస్ గుండాలపైన కేసులు నమోదు చేయాలని, వారిని అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేశారు .