అల్లు అర్జున్ అరెస్ట్ కేటీఆర్ కామెంట్స్
పోలీసుల వైఖరిపై కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేశారు. దీనిపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని పేర్కొన్నారు.
అయితే తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ నిజంగా ఎవరు విఫలం అయ్యారంటూ ప్రశ్నించారు కేటీఆర్. తను ఎలా బాధ్యత వహిస్తాడంటూ ప్రశ్నించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.
అదే దిక్కుమాలిన లాజిక్‌తో వెళితే హైదరాబాద్‌లో హైడ్రామా చేసిన భయం సైకోసిస్‌తో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.