రోహిత్ సేనకు కేటీఆర్ కంగ్రాట్స్
విశ్వ విజేతగా నిలిచిన భారత్
హైదరాబాద్ – వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాను అద్భుతమైన ఆట తీరుతో 7 పరుగుల తేడాతో ఓడించింది భారత జట్టు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా స్పందించారు.
భారత జట్టు సంచలనాత్మక ప్రదర్శనతో అన్ని విభాగాల్లో సత్తా చాటిందని పేర్కొన్నారు. భారత జట్టును విజయ పథంలో నడిపించిన హెడ్ కోచ్ ది వాల్ రాహుల్ ద్రవిడన్ ను, టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తారు.
ఎవరూ ఊహించని రీతిలో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించడం విశేషమని పేర్కొన్నారు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ రెండోసారి టీమిండియా టైటిల్ ను సాధించడమే కాదు 143 కోట్ల భారతీయుల హృదయాలను గెలుచు కున్నారంటూ ప్రశంసించారు కేటీఆర్.